Philippines | ప్రకృతి విపత్తులతో ఫిలిప్పీన్స్ (Philippines) అల్లాడిపోతోంది. గతనెల వరుస భూకంపాలు వణికించిన విషయం తెలిసిందే. ఆ విపత్తు నుంచి కోలుకోక ముందే కల్మేగీ తుఫాను (Typhoon Kalmaegi) విధ్వంసం సృష్టిస్తోంది. తుఫాను కారణంగా భారీ వర్షాలు, వరదలు ఫిలిప్పీన్స్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. వరదలకు భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఈ తుఫానుకు సెబు ప్రావిన్స్ (Cebu province) అత్యంత ప్రభావితమైంది.
స్థానిక మీడియా ప్రకారం.. తుఫాను కారణంగా సంభవించిన వరదలకు ఇప్పటి వరకూ దాదాపు 90 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. ఈ వరదల్లో 26 మంది గల్లంతయ్యారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో సంభవించిన ఘోర భూకంపం నుంచి కోలుకుంటున్న ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు నివాస ప్రాంతాలను ముంచెత్తాయి. దీంతో ప్రజలు ఎటు వెళ్లాలో తెలియక ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ వరదలకు అనేక వాహాలను కొట్టుకుపోయాయి. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి.
Also Read..
Ghazala Hashmi | వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా.. హైదరాబాదీ మహిళ గజాలా హాష్మీ