జడ్చర్ల : మహబూబ్నగర్ (Mahabubnagar) జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని బాలానగర్ మండలం మూతి ఘనపూర్ గ్రామ శివారులో ప్రమాదవశాత్తు చెరువులో (Ponds) పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గ్రామానికి చెందిన శివరాములు (50) మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో స్నానం చేయడానికి చెరువులోకి దిగి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు అందులో మునిగిపోతుండడంతో గమనించిన అదే గ్రామానికి చెందిన యాదగిరి (32) కాపాడేందుకు చెరువులోకి దూకాడు. ఇద్దరు కూడా చెరువులో గల్లంతు ( Missing ) కావడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గ్రామస్థుల సహకారంతో చెరువులో గాలింపు చర్యలు మొదలు పెట్టారు.