ఎటావా సఫారీ పార్క్‌లో రెండు సింహాలకు కరోనా పాజిటివ్
ఎటావా సఫారీ పార్క్‌లో రెండు సింహాలకు కరోనా పాజిటివ్ | ఉత్తరప్రదేశ్‌లోని ఎటా సఫారీ పార్క్‌లో రెండు సింహాలకు కరోనా సోకింది. నాలుగేళ్ల గౌరీ, తొమ్మిదేళ్ల జెన్నీఫర్ నమూనాలను బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐవీఆర్ఐ)కు పంపామని, ఫలితాల్లో పాజిటివ్‌గా వచ్చినట్లు డైరెక్టర్ కేకే సింగ్ తెలిపారు.

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ఎటా సఫారీ పార్క్‌లో రెండు సింహాలకు కరోనా సోకింది. నాలుగేళ్ల గౌరీ, తొమ్మిదేళ్ల జెన్నీఫర్ నమూనాలను బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐవీఆర్ఐ)కు పంపామని, ఫలితాల్లో పాజిటివ్‌గా వచ్చినట్లు డైరెక్టర్ కేకే సింగ్ తెలిపారు. సింహాల్లో ఆకలి తగ్గడం, జ్వరం లక్షణాలు కనిపించాయని.. దీంతో రక్తం, మలం నమూనాలను ఈ వారం ప్రారంభంలో పరీక్షల కోసం పంపినట్లు పేర్కొన్నారు. మిగతా సింహాలకు వైరస్ సోకుండా వాటిని ప్రత్యేక ప్రాంతానికి తరలించి, వైద్య చికిత్సలు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. వాటి పరిస్థితి విషమంగానే ఉందని చెప్పారు. అలాగే మరో 14 సింహాల నమూనాలను ఐవీఆర్ఐకు పంపారు.
అయితే, సంతానోత్పత్తి కేంద్రంలో సింహాలకు వైరస్ సోకినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇటీవల ఓ పార్క్ కార్మికుడికి కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు. ఈ క్రమంలో జంతువుల భద్రతను పెంచారు. పార్క్‌లోని ఉద్యోగులందరూ పీపీఈ కిట్లు ధరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే సిబ్బంది నమూనాలను ఆర్టీ పీసీఆర్ పరీక్షల కోసం తరలించారు. సింహాలకు వైరస్ పాజిటివ్‌గా తేలిన క్రమంలో పార్క్‌లో సందర్శకుల ప్రవేశంపై నిషేధం విధించారు. ఇదిలా ఉండగా.. ఇటీవల హైదరాబాద్ జూపార్క్లోనూ ఎనిమిది సింహాలకు కరోనా సోకిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
న్యూజిలాండ్‌తో ఫైనల్‌కు భారత్ జట్టు ఎంపిక
Double Mask అవసరమా? సర్జికల్, క్లాత్ మాస్కుల్లో ఏది పైనుంచి పెట్టుకోవాలి?
ఈ సమ్మర్లో షుగర్ పేషెంట్స్ ఇవి ట్రై చేయొచ్చు
అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ప్రమాదం.. దంపతుల మృతి
భారత్‌కు ఆక్సిజన్ జనరేటర్లను మోసుకొస్తున్న అంటోనోవ్
చైనా సినోఫార్మ్ వ్యాక్సిన్‌కు WHO అనుమతి
మణిపూర్‌లో 24 గంటల కర్ఫ్యూ
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- corona virus
- Covid-19
- Etawah
- Lions
RELATED ARTICLES
తాజా వార్తలు
Jajula Srinivas Goud | బీసీ కులగణనపై అమిత్ షా స్పందించాలి.. దేశవ్యాప్త ఉద్యమం ఆపేది లేదు: జాజుల
Books Launch | తెలుగు సాహితీ వికాస వేదిక ఆధ్వర్యంలో ఘనంగా పుస్తకాల ఆవిష్కరణ
Gold in Rapido | ర్యాపిడోలో బంగారం పంపిస్తే.. ఆభరణాలతో ఉడాయించిన డ్రైవర్!
‘విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తయారు చేయడంలో సైన్స్ కాంగ్రెస్ దోహదం’
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

