సూర్యాపేట : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సూర్యాపేటలో గ్యాస్ ట్యాంకర్ పేలి ఇద్దరు మృతి చెందారు. స్థానిక కొత్త బస్టాండ్ వద్ద గల హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
ట్యంకర్కు వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే..డీజిల్, పెట్రోల్ రవాణా చేసే ట్యాంకర్ వాల్ లీక్ అవుతుండడంతో వెల్డింగ్ చేసేందుకు ట్యాంకర్ను తీసుకొని వెళ్లారు.
వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి వెల్డింగ్ చేస్తున్న మంత్రి అర్జున్(35) తో పాటు ట్యాంకర్ క్లీనర్ గట్టు అర్జున్ ఇద్దరు స్పాట్లో మృతి చెందగా.. మల్లేష్, వెంకటనారాయణ డ్రైవర్ గాయాల పాలయ్యారు. కాగా, మల్లేష్ పరిస్థితి సీరియస్గా ఉంది.
ట్యాంకర్ ఖాళీగానే ఉన్నప్పటికి అందులో గ్యాస్ ఫామ్ కావడం వెల్డింగ్ చేస్తున్న సమయంలో వేడికి మంటలు అంటుకొని భారీ శబ్దంతో పేలుడు సంభవించింది.
పేలుడుతో ఒక్కసారిగా బీతావాహ వాతావరణం నెలకొంది. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.