Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కారు వేగంగా వచ్చి లోయలో పడిపోవడంతో ఇద్దరు మరణించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్లోని లూధియానాకు చెందిన ఇద్దరు వ్యక్తులు మారుతి స్విఫ్ట్ కారులో మాతా చింత్పూర్ణి దేవాలయాని వెళ్లి వస్తున్నారు.
ఈ క్రమంలో హిమాచల్ ప్రదేశ్లోని ఉనా జిల్లా, బర్వైపూర్–హోర్షియార్పూర్ రోడ్డులో కారు ప్రమాదానికి గురైంది. మూల మలుపు వద్ద కారు వేగంగా వెళ్తుండగా కారు టైర్ పేలిపోయింది. దీంతో అదుపు తప్పింది. ఈ క్రమంలో కారు ఆ రోడ్డు నుంచి కింద లోయలోకి పడిపోయింది. ఇది పర్వత ప్రాంతం కావడం, రోడ్డు పక్కన రెయిలింగ్ లేకపోవడం, అతి వేగం వల్ల ఎత్తైన ప్రదేశం నుంచి కింద లోయలోకి కారు పడిపోయింది. ఈ క్రమంలో కారుకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో కారులోని ఇద్దరు వ్యక్తులు మరణించారు.
Car flies off hilly road in Himachal after tyre burst, falls into gorge
A speeding car plunged into a deep gorge on the Una highway in Himachal, killing two people. pic.twitter.com/fC1azH7Wc1
— زماں (@Delhiite_) April 30, 2026
ఒక వ్యక్తి మృతదేహం దూరంగా పడిపోయి కనిపించగా, మరొకరి మృతదేహం కారులోనే కాలిపోయింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు ఇద్దరి మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నాయి. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.