భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని ఓ ఫారెస్టు బీట్ అధికారి లంచం ( Bribe ) తీసుకుంటూ ఏసీబీ అధికారులకు (ACB Raid ) చిక్కాడు. జిల్లాలోని గుండాల ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని నడిమిగూడెం ఫారెస్టు బీట్ అధికారి బానోత్ నరేష్‌ను గురువారం రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.
తన తండ్రికి ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల పోడు భూముల్లో అటవీ అధికారులు జోక్యం చేసుకోవద్దని కోరగా బీట్ అధికారి లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు వ్యూహత్మకంగా వ్యవహరించి బీట్ అధికారిని పట్టుకుని వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.