ఒకో మారెట్‌కు రూ.4.50 కోట్లు కేటాయింపు
త్వరితగతిన పనులు పూర్తి చేయాలి
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్‌కుమార్
నగరంలో నిర్మాణ పనుల పరిశీలన
ఖమ్మం/రఘునాథపాలెం, ఫిబ్రవరి 2 : ఖమ్మం నగరంలో మరో వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్లు అందుబాటులోకి రానున్నాయని, శరవేగంగా పనులు పూర్తవుతున్నాయని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. బుధవారం ఆయన నగర మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి నిర్మాణాలను పరిశీలించారు. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసి మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఖానాపురంలో రూ.4.50 కోట్లు, వీడీవోస్ కాలనీలో రూ.4.50 కోట్లతో మార్కెట్ల పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఒక్కో మార్కెట్ 2.01 ఎకరాల్లో నిర్మిస్తున్నామన్నారు. మారెట్‌కు వచ్చే వారికి ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అన్ని వైపులా మార్కెట్లకు రోడ్లు అనుసంధానం చేయాలని సూచించారు. అనంతరం మారెట్ ప్లాన్ మ్యాప్‌ను మంత్రి పరిశీలించారు. మారెట్ ప్రాంగణంలో పారింగ్కు ఇబ్బందులు ఉండొద్దన్నారు. మార్కెట్ల ప్రాంగణంలో గ్రీనరీకి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రైతులు, వ్యాపారులు, వినియోగదారుల కోసం తాగునీటి వసతి, కూర్చోడానికి బల్లాలు ఏర్పాటు చేయాలన్నారు. వారి వెంట సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు తదితరులు ఉన్నారు.
‘బృహత్ పల్లెప్రకృతి’వనం.. జిల్లాకే ఆదర్శంగా ఉండాలి
ఇల్లెందు ప్రధాన రహదారికి ఆనుకొని రఘునాథపాలెంలో పదెకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించే మండల బృహత్ పల్లెప్రకృతి వనం ఖమ్మం జిల్లాకు ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. బృహత్ పల్లెప్రకృతి వనం పనులను బుధవారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని, పల్లెప్రకృతి వనంలో ఆట వస్తువులు, వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, జిమ్ పరికరాలు ఏర్పాటు చేయాలని జడ్పీ సీఈవోను ఆదేశించారు. సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, మేయర్ నీరజ, డీఎల్పీవో ప్రభాకర్‌రావు, ఎంపీడీవో రామకృష్ణ, టీఆర్ఎస్ నాయకులు కుర్రా భాస్కర్‌రావు, గుడిపుడి రామారావు, మందడపు నర్సింహారావు, గ్రామ కార్యదర్శి ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.