హైదరాబాద్: నగరంలోని ఎస్ఆర్ నగర్లో (SR Nagar) గ్యాస్ సిలిండర్ పేలింది. ఎస్ఆర్ నగర్లోని బీకేగూడలో ఉన్న ఓ ఇంట్లో అర్ధరాత్రి వంట గ్యాస్ లీకవడంతో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి గోడ కూలిపోయింది. దీంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మరో యువకునికి మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను గాంధీ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.