Jamuna | అలనాటి తెలుగు సినీ తారల్లో సీనియర్ నటి స్వర్గీయ జమునాది ఓ ప్రత్యేక స్థానం. ఆమె నటనకు ఎవరూ వంక పెట్టింది లేదు. అయితే జమున కేవలం నటిగానే కాదు, రాజకీయాల్లో ఎంపీగా, నాటక అకాడమీ అధ్యక్షురాలిగా, సమాజ సేవకురాలిగా, భార్యగా, తల్లిగా ఎన్నో పాత్రలు ధరించిన మల్లీటాలెంటెడ్ పర్సన్ జమున. అయితే జమున జీవితం, కెరీర్ కూడా సాఫీగా సాగిపోలేదు.
కెరీర్ పరంగా ఆమె కూడా ఎన్నో అట్లుపోట్లను ఎదుర్కొంది. తను కెరీర్లో ఎదుర్కొన గడ్డు పరిస్థితుల గురించి ఓ సందర్బంలో వివరించారు జమున. ” నా మకాం మద్రాసుకు మార్చుకున్న టైమ్లో సినిమా రంగంలో నాకు పలు చేదు అనుభవాలు వున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పాలంటే.. నా జీవితాంతం గుర్తుండేది మాత్రం ఒకటి వుంది. ఇద్దరు ప్రముఖ కథానాయకులు నాతో యాక్ట్ చెయ్యమంటూ దాదాపు మూడేళ్లు నన్ను బహిష్కరించారు. దాని నుండి బయటపడటానికి గట్టి ఫైట్ చేశాను.
ఒక విధంగా చెప్పాలంటే అదొక పోరాటమే. కానీ నా ఈ పోరాటంలో కూడా ఏ రోజు నా ఆత్మభిమానాన్ని చంపుకోలేదు. నా వైపు రాంగ్ లేనప్పుడు నేనెందుకు ఒకరికి లొంగివుండాలి.. భయపడాలనుకునే దాన్ని.నా సినిమాలు నాకున్నాయి. అయితే అనుకోకుండా అదే సమయంలో నాకు బాలీవుడ్లో అవకాశాలొచ్చాయి. హిందీలో వరుసగా పన్నెండు సినిమాలు చేశాను.మిలన్ అనే సినిమాలో నా నటనను మెచ్చి ఫిలిం ఫేర్ అవార్డు కూడా వరించింది. ఆ సినిమా రజతోత్సవం కూడ జరుపుకోంది.
ఇక హిందీలో బిజీగా వుండటంతో మకాంను ముంబైకి మార్చమని మరిన్ని అవకాశాలు వస్తాయని చాలా మంది సలహాలిచ్చారు.కానీ మనకు అవసరమా.. తెలుగు సినీ పరిశ్రమ ప్రేక్షకుల అండదండాలు, అభిమానాలు చాలనుకున్నాను. చివరిగా గుండమ్మ కథ సినిమా కోసం సినీ పరిశ్రమ పెద్దలు కుదర్చిన రాజీతో మళ్లీ తెలుగులో బిజీ అయ్యాను’ అని చెప్పుకొచ్చారు జమున