అచ్చంపేట : నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలో విషాదం( Tragedy) చోటు చేసుకుంది. వ్యవసాయ పొలంలో ( Agricultural field) ఏర్పాటుచేసిన కవర్ గుంటలో పడి ఇద్దరు చిన్నారులు ( Childrens ) మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మండలంలోని బొమ్మనపల్లి గ్రామానికి చెందిన లో కుంభం ధరణి, సుధాకర్ యాదవ్ దంపతులు వ్యవసాయపొలంలో కవర్తో నీటి గుంటను నిర్మించుకున్నారు.
వర్షాలు కురుస్తుండడంతో పొలంలో పత్తి విత్తనాలు నాటేందుకు వారి వెంట కుమారులు అశ్విత్ కుమార్ (8),చేతన్ (6) సోమవారం తీసుకెళ్లారు. తల్లిదండ్రులు పత్తి విత్తనాలు నాటుతుండగా పిల్లలిద్దరూ ఆడుకుంటూ కవర్ గుంట వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మరణించారు. దీనిని గమనించని తల్లిదండ్రులు తమ పిల్లలు కనిపించడం లేదని పరిసర ప్రాంతాల్లో గాలించారు. చివరకు సొంత పొలంలోనే నీటి గుంటలో విగత జీవులుగా పడి ఉండడాన్ని చూసి బోరున విలపించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాలను ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబాన్ని ఆదకోవాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు, మాజీ సర్పంచ్ రాత్లావత్ బొడ్కా నాయక్ ప్రభుత్వాన్ని కోరారు.