వయసు పైబడుతున్నా కొందరి అందం అంతగా మారదు. శరీరాకృతిలోనూ కళ తగ్గదు. నటి జ్యోతిక వయసు పెరుగుతున్నా మునుపటిలాగే కనిపిస్తున్నది. అందరికీ సాధ్యం కాని ఈ రహస్యం ఏమిటని అడిగేవాళ్లు చాలామంది ఉన్నారు. సినిమా తారలు అందాల రహస్యాలు చెప్పడం, సౌందర్యాభిమానులు అనుసరించడం మామూలే. ట్వేక్ ఇండియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జ్యోతిక తన అందం వెనుక ఉన్న రహస్యాన్ని చెప్పుకొచ్చింది.
ఎత్తు, వయసుకు తగ్గ బరువు ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ఎక్కువ ఉంటే తగ్గాలి. తక్కువ ఉంటే పెరగాలి. ఆ తర్వాత కచ్చితమైన బరువుని నిలుపుకోవడమే అసలైన సమస్య. ఇక వయసు పెరుగుతుంటే బరువును తగ్గించుకోవడం సవాలే. ప్రొటీన్ రిచ్ ఫుడ్, వ్యాయామంతో అందమైన శరీరాకృతిని కాపాడుకోవచ్చు.
శరీర బరువుని కాపాడుకునేందుకు ప్రతి రోజూ శరీర బరువులో ప్రతి కిలోకు ఒక గ్రాము ప్రొటీన్ చొప్పున తప్పకుండా ఆహారంలో ఉండేలా జాగ్రత్తపడితే బరువు నియత్రించుకోవచ్చని చెప్పింది జ్యోతిక. తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారం తీసుకుంటే ముఖంలో వయసు కనిపించదని ఆరోగ్యం, అందం రహస్యాలు చెప్పింది.