హైదరాబాద్, జూలై 14 : ఏరోస్పేస్ ఇంజినీరింగ్ సంస్థ సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ అంతర్జాతీయ వ్యాపార విస్తరణలో భాగంగా బ్రిటన్‌కు చెందిన బ్రోమ్‌ఫోర్డ్ ప్రిసిషన్ సొల్యూషన్స్‌ను కొనుగోలు చేసింది.
100 శాతం వాటాను కొనుగోలు చేయడానికి సంస్థ రూ.153 కోట్ల నిధులు వెచ్చించనున్నట్టు కంపెనీ సీఈవో సునిల కలిదిండి తెలిపారు. ఈ ఒప్పందం ఈ నెల చివరిలోగా ముగియనున్నదన్నారు.