న్యూఢిల్లీ, జూలై 14 : స్వీడన్‌కు చెందిన ఫర్నిచర్ రిటైలర్ ఐకియా దేశీయ మార్కెట్లో సత్తాచాటడానికి సిద్ధమవుతున్నది. ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టిన సంస్థ..తాజాగా 2030 నాటికి రూ.21 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టబోతున్నట్టు కంపెనీ ఇండియా బిజినెస్ హెడ్ పాట్రిక్ ఆంటోని తెలిపారు.
ఈ పెట్టుబడులతో మరో 15 స్టోర్లను ప్రారంభించబోతున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, ముంబై, నోయిడా, గురుగ్రామ్‌లలో పది అవుట్లెట్లను నిర్వహిస్తున్నది. అలాగే వచ్చే ఐదేండ్లలో టర్నోవర్ రూ.8 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకుందన్నారు.