హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): ఈ నెల 20న క్యూర్ పరిధిలో ఎల్ఐజీ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుడుతున్నట్టు రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఎల్ఐజీ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. తొలి దశలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రతి నియోజకవర్గానికి కనీసం 500 చొప్పున ఆయా స్థానిక పరిస్థితులను బట్టి అవసరమైన చోట 1000 ఇండ్లు నిర్మిస్తామని పేర్కొన్నారు.