భారత అసిస్టెంట్ కోచ్ దష్కటే ఔట్!
టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ దష్కటే జట్టును వీడే యోచనలో ఉన్నాడు. కోచ్గా రెండేండ్ల కాంట్రాక్టు పూర్తవడంతో ఇంగ్లండ్తో ఈ నెల 19న ముగిసే చివరి వన్డే తర్వాత కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తనను రిలీవ్ చేయాలని బీసీసీఐకి సమాచారం ఇచ్చాడు.
- జట్టును వీడే యోచనలో ర్యాన్
బర్మింగ్హామ్ : టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ దష్కటే జట్టును వీడే యోచనలో ఉన్నాడు. కోచ్గా రెండేండ్ల కాంట్రాక్టు పూర్తవడంతో ఇంగ్లండ్తో ఈ నెల 19న ముగిసే చివరి వన్డే తర్వాత కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తనను రిలీవ్ చేయాలని బీసీసీఐకి సమాచారం ఇచ్చాడు. బోర్డు, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఓకే చెబితే మూడో వన్డే తర్వాత ర్యాన్ జట్టుకు వీడ్కోలు పలకనున్నాడు. ముగ్గురు కొడుకుల తండ్రి అయిన దష్కటే వ్యక్తిగత కారణాలతోనే కోచ్ పోస్టు నుంచి తప్పుకుంటున్నట్టు బోర్డుకు సమాచారం అందించాడు. నెదర్లాండ్స్ మాజీ క్రికెటర్ అయిన ర్యాన్ కుటుంబం లండన్లో నివాసం ఉంటుంది.
తన కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించేందుకు భారత జట్టు కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని అతను నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో జట్టులో తనకు అప్పగించిన పాత్ర పట్ల అతను అసంతృప్తితో ఉన్నట్టు సమచారం. అసిస్టెంట్ కోచ్గా దష్కటే ప్రధానంగా ఫీల్డింగ్ బాధ్యతలు చూడాలి. కానీ, హైదరాబాదీ టి. దిలీప్ రూపంలో జట్టులో ప్రత్యేక ఫీల్డింగ్ కోచ్ ఉండటంతో దష్కటే పాత్ర పరిమితమైంది. మరోవైపు ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కూడా రాజీనామా చేస్తాడని వస్తున్న వార్తలను బోర్డు వర్గాలు ఖండించాయి. ద్రవిడ్ హయాం నుంచి ఫీల్డింగ్ కోచ్గా ఉన్న దిలీప్ జట్టుతో కొనసాగుతాడని స్పష్టం చేశాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

