హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయన మిత్రబృందం గురువారం ఏపీలోని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఆయన నివాసంలో కలిశారు.
ఈ సందర్భంగా గోరంట్ల దంపతులు మంత్రి తుమ్మలకు ఘనస్వాగతం పలికారు. అనంతరం పలు అంశాలపై వీరిద్దరూ చర్చించారు. వారితో పాటు పలువురు టీడీపీ నేతలు ఉన్నారు.