హైదరాబాద్, జూలై 28(నమస్తే తెలంగాణ) : తిరుపతి హైవేలో ప్లాట్లు కొంటే జీవితాంతం శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామంటూ ఎస్సీపీ డెవలపర్స్ పేరుతో కొం దరు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని టీటీడీ తీవ్రంగా ఖండించింది. ఈ ప్రచారానికి తమకు ఎలాంటి సంబంధం లేదని, ఇలాంటి హామీలు ఇచ్చే అధికారం ఎవరికీ లే దని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.
భక్తులు ఇలాంటి ప్రకటనలు నమ్మి మోసపోవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. శ్రీవారి ప్రతిష్ఠను స్వ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్న సదరు సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపింది.