Tirumala | దేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలో వాటర్,ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ అభివృద్ధి : టీటీడీ
Tirumala | తిరుమలలోని వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ ను దేశంలోనే ఆదర్శ వంతంగా నిలిచేలా అభివృద్ధి చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి వెల్లడించారు.
తిరుమల : తిరుమలలోని వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ ( Food Analysis Lab ) ను దేశంలోనే ఆదర్శ వంతంగా నిలిచేలా అభివృద్ధి చేస్తున్నట్లు టీటీడీ ( TTD ) అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ( EO Ch. Venkaiah Chowdary ) వెల్లడించారు. ల్యాబ్ లో బుధవారం ఆయుధ పూజనునిర్వహించిన సందర్భంగా ఆయన ల్యాబ్‌లో కార్యకలాపాలు, పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోని ఇతర ఆలయాలు, దేవాదాయ సంస్థల్లో లేని విధంగా అత్యున్నత ప్రమాణాలతో ల్యాబ్‌ను నిర్మించినట్లు పేర్కొన్నారు.ల్యాబ్ నిర్వహణ కోసం ప్రస్తుతం అంతర్గత సిబ్బందితో పాటు రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషన్ నుంచి డిప్యుటేషన్‌పై తీసుకున్న సిబ్బందితో కలిపి మొత్తం 34 మంది పనిచేస్తున్నారని తెలిపారు. పూర్తిస్థాయిలో ల్యాబ్ నిర్వహణకు మరో ఎనిమిది మంది అవసరమని, త్వరలో వారిని కూడా నియమించి మొత్తం 42 మంది అర్హత కలిగిన సిబ్బందితో అన్ని విభాగాలను నిర్వహించనున్నట్లు వివరించారు.
టీటీడీకి అవసరమైన ఆహార పదార్థాల కొనుగోలు దశ నుంచే నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్న ట్లు అదనపు ఈవో తెలిపారు. వంట పూర్తయిన తర్వాత కూడా ఆహార పదార్థాల నమూనాల ను సేకరించి పరీక్షిస్తున్నట్లు తెలిపారు. లడ్డూ నాణ్యతను పరిశీలించేందుకు సుమారు 11 రకాల పారామీటర్లను పరీక్షించే అత్యాధునిక పరికరాలు ల్యాబ్‌లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
చిన్న, పెద్ద లడ్డూలలో జీడిపప్పు పరిమాణం, తేమ శాతం, నీటి శాతం, చక్కెర, సిరప్ తదితర అంశాలను కూడా విశ్లేషించే సదుపాయం ఉందన్నారు. లడ్డూలోని పోషక విలువలను సైతం అంచనా వేయగలుగుతున్నట్లు తెలిపారు. సాంబార్ రైస్, వండిన అన్నం, కొనుగోలు చేసే బియ్యం, డ్రై ఫ్రూట్స్ తదితర పదార్థాల నాణ్యతను ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాల ప్రకారం పరీక్షిస్తున్నట్లు తెలిపారు.
నెయ్యి నమూనాలను ప్రతిరోజూ సేకరించి పరీక్షించిన తర్వాతే వినియోగానికి అనుమతి స్తున్నట్లు చెప్పారు. భక్తులకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన ఆహారం, తాగునీరు అందించే విషయంలో టీటీడీ దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఈ ల్యాబ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | దేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలో వాటర్,ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ అభివృద్ధి : టీటీడీ
4 Militants Killed | మణిపూర్‌లో ప్రత్యర్థి నాగా వర్గాల మధ్య కాల్పులు.. నలుగురు మిలిటెంట్లు మృతి
ప్రభుత్వ ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దని ఎమ్మెల్యే మందుల సామేల్కి వినతి
Hunter Road | సౌకర్యవంతమైన సేవల కోసం హంటర్ రోడ్డులో కొత్త బస్ స్టాప్
సారపాకలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

