4 Militants Killed | మణిపూర్‌లో ప్రత్యర్థి నాగా వర్గాల మధ్య కాల్పులు.. నలుగురు మిలిటెంట్లు మృతి
4 Militants Killed | మణిపూర్‌లో రెండు ప్రత్యర్థి నాగా వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇరు వర్గాలకు చెందిన నలుగురు మిలిటెంట్లు మరణించారు. భయాందోళన చెందిన ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోయారు.
ఇంఫాల్: మణిపూర్‌లో రెండు ప్రత్యర్థి నాగా వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇరు వర్గాలకు చెందిన నలుగురు మిలిటెంట్లు మరణించారు. భయాందోళన చెందిన ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోయారు. (4 Militants Killed) మణిపూర్‌లోని నోనీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో టావోడైజింగ్ గ్రామంలో నాగా ప్రత్యర్థి వర్గాలైన జెలియాంగ్రాంగ్ యునైటెడ్ ఫ్రంట్ (జెంచుయ్ వర్గం) జెడ్‌యూఎఫ్(జే), నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగలిమ్ (ఎన్ఎస్సీఎన్-ఐఎం)కు చెందిన మిలిటెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. జెడ్‌యూఎఫ్(జే)కు చెందిన ముగ్గురు మిలిటెంట్లు, (ఎన్ఎస్సీఎన్-ఐఎం)కు చెందిన ఒక మిలిటెంట్ ఈ కాల్పుల్లో మరణించారు.
కాగా, నాగా ప్రత్యర్థి వర్గాల ఘర్షణ, కాల్పులకు గ్రామస్తులు భయాందోళన చెందారు. తమ ఇళ్లను వీడి పారిపోయారు. ఇతరులను హెచ్చరించడానికి, ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ లౌడ్ స్పీకర్ల ద్వారా గ్రామస్తులు హెచ్చరించారు. నాగా ప్రత్యర్థి వర్గాల మధ్య కొన్ని గంటల వరకు నిరంతరాయంగా కాల్పులు జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు.
మరోవైపు ప్రాదేశిక నియంత్రణ, ఈ ప్రాంతంపై పట్టు కోసం ప్రత్యర్థి నాగా మిలిటెంట్ గ్రూపుల మధ్య హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. తాజా కాల్పులకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అయితే సాయుధ బృందాలు ఘర్షణ విరమించి శాంతికి అవకాశం ఇవ్వాలని నుంగ్బా ప్రాంతానికి చెందిన రోంగ్‌మే నాగా లుఫువామ్ విజ్ఞప్తి చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
4 Militants Killed | మణిపూర్‌లో ప్రత్యర్థి నాగా వర్గాల మధ్య కాల్పులు.. నలుగురు మిలిటెంట్లు మృతి
ప్రభుత్వ ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దని ఎమ్మెల్యే మందుల సామేల్కి వినతి
Hunter Road | సౌకర్యవంతమైన సేవల కోసం హంటర్ రోడ్డులో కొత్త బస్ స్టాప్
సారపాకలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Y.S. Sharmila | ఎన్నికల్లో విజయం ప్రజా తీర్పు కాదు..అధికార మదంతో బలవంతపు గెలుపు : వైఎస్ షర్మిల
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

