TTD | స్విమ్స్ నెఫ్రాలజీలో టెలీ మెడిసిన్ వ్యవస్థ ప్రారంభించాలి : టీటీడీ ఈవో
TTD | కిడ్నీ వ్యాధులతో బాధపడే వారికి తగిన సలహాలు, సూచనలు, వైద్య సహాయం అందించడానికి శ్రీ వేంకటేశ్వరస్వామి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(స్విమ్స్)లో నెఫ్రాలజీ(Nephrology) విభాగం టెలీ మెడిసిన్ వ్యవస్థను ప్రారంభించాలని టీటీడీ(TTD) ఈవో ఏవీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు.
అమరావతి : కిడ్నీ వ్యాధులతో బాధపడే వారికి తగిన సలహాలు, సూచనలు, వైద్య సహాయం అందించడానికి శ్రీ వేంకటేశ్వరస్వామి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(స్విమ్స్)లో నెఫ్రాలజీ(Nephrology) విభాగం టెలీ మెడిసిన్ వ్యవస్థను ప్రారంభించాలని టీటీడీ(TTD) ఈవో ఏవీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు.
టీటీడీ జేఈవో సదా భార్గవి, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ తో కలసి శుక్రవారం ఆయన నెఫ్రాలజీ, యూరాలజీ(Urology) విభాగాలను పరిశీలించారు.
ఇన్ పేషంట్ వార్డులు, డయాలసిస్ వార్డులు, ఐసీయూ(ICU) విభాగాలను ఆయన పరిశీలించారు. రోగులకు అందిస్తున్న సేవలను తెలుసుకున్నారు. ఇంటి వద్దే డయాలసిస్(Dialysis) చేసుకునే అవకాశం ఉండి ఆసుపత్రికి వస్తున్న రోగుల గురించి ఈవో వివరాలు తెలుసుకున్నారు. డయాలసిస్ కోసం ఉపయోగించే బ్యాగులకు డిమాండ్ ఉందని డాక్టర్లు వివరించగా ఏపీఎంఐడీసీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తో ఈవో ఫోన్లో మాట్లాడి స్విమ్స్ కు డయాలసిస్ బ్యాగులను పంపాలని కోరారు.
డయాలసిస్ చేయించుకుంటున్న పిల్లలకు పెన్షన్ రావడం లేదని బాధితుల కుటుంబీకులు ఈవో దృష్టికి తీసుకువచ్చారు. స్విమ్స్ హాస్టల్(Svims Hostel)లో విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్న టిఫిన్, భోజనం నాణ్యత గురించి ఆరా తీశారు. ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లో ఎక్కడా ఇబ్బందులు ఎదురుకాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఐటీ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రికి సంబంధించిన ఇంజినీరింగ్ నిర్వహణ పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడి పనులు చేయించుకోవాలని సూచించారు. నెఫ్రాలాజీ, యూరాలజీ విభాగాల పనితీరును అభినందించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

