హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): కొత్త జిల్లాల ప్రకారం ఉపాధ్యాయుల కేటాయింపు మార్గదర్శకాలు ప్రకటించి, బదిలీలు, పదోన్నతులు, అంతర్జిల్లా బదిలీల షెడ్యూల్‌ను విడుదల చేయాలని పీఆర్టీయూ టీఎస్ విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు సోమవారం సీఎస్ సోమేష్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. రెండుమూడు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేసి, ఈ నెలాఖరుకల్లా ప్రక్రియ పూర్తిచేస్తామని సీఎస్ హామీనిచ్చినట్టు నాయకులు తెలిపారు.
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): మోడల్ స్కూల్స్‌లో ఇంటర్ విద్యార్థులు నీట్, ఐఐటీ, ఎంసెట్, వంటి పోటీ పరీక్షలకు కోచింగ్ ఇచ్చేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ఏర్పాటుచేయాలని తెలంగాణ మోడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సం ఘం నేతలు సోమవారం విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, టీఎంఎస్టీఏ రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు, కార్యదర్శి శీనయ్య, ఉపాధ్యక్షుడు పరమేశ్ తదితరులు పాల్గొన్నారు.
మోడల్ స్కూళ్లల్లో పనిచేస్తున్న అవర్లీ బేస్డ్ టీచర్లకు మిగతా సొ సైటీల్లో పనిచేస్తున్న అవర్లీ బేస్డ్ గెస్ట్ ఫ్యాకల్టీలా వేతనాలు పెంచాలని కోరుతూ నాయకులు నాగరాజు, ఐలయ్య, మనోహర్ తదితరులు మంత్రి సబితాఇంద్రారెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): పాఠశాల ని ర్వహణ, పర్యవేక్షణలో పౌరసమాజాన్ని భాగస్వామ్యం చేయడం ద్వారా విద్యాప్రమాణాల పెంపు కోసం ఏర్పాటైన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ)లు త్వరలోనే కొత్తవి కొలువుదీరనున్నా యి. ప్రస్తుత కమిటీల కాలపరిమితి ఈ నెల 30తో ముగియనున్నది. డిసెంబర్లో కొత్త కమిటీల ఏర్పాటు కోసం విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. త్వరలో షెడ్యూల్ ప్రకటించను న్నారు. రెండేండ్ల వ్యవధి గల ఎస్‌ఎంసీల కాలం గతేడాది నవంబర్‌లో ముగిసింది. కొవిడ్ నేపథ్యంలో ఏడాదిపాటు పొడిగించారు. ఈ కమిటీల్లో స్వశక్తి పొదుపు సంఘాలు, సహకార సంఘాల సభ్యు లు, పూర్వ విద్యార్థులు, దాతలను సభ్యులుగా తీసుకుంటారు.