హైదరాబాద్ : హైదరాబాడ్లోని మంత్రుల నివాసంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao), దేవాదాయ, ధర్మాదాయ, న్యాయశాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran reddy) ఇవాళ భేటీ అయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాలపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు నేతలతో సమీక్షించారు.
ఈ సందర్భంగా నేతలు ఉమ్మడి జిల్లాకు మరిన్ని పంచాయతీరాజ్ రోడ్లు, డ్రైనేజీలు, సిసి రోడ్లు ఇవ్వాలని మంత్రులను కోరుతూ..విజ్ఞాపన పత్రాన్నిఅందచేశారు. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో దేవాలయాల పరిస్థితులు, చేయాల్సిన అభివృద్ధిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరించారు.