భారత్‌తో కయ్యం.. రష్యాతో నెయ్యం!
ఆత్మవంచనలో ట్రంప్‌నకు సాటిలేరు.. రష్యా చమురు కొనుగోళ్లపై ఆంక్షల చట్టం చేసి తానే యూటర్న్.. రష్యా నుంచి డీజిల్ కొనుగోలుకు పుతిన్‌తో ఒప్పందం ఖరారు
న్యూఢిల్లీ, అక్టోబర్ 10: ఆత్మవంచనకు గనుక నోబెల్ బహుమతి ఉండి ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిస్సందేహంగా దానికి ప్రధాన పోటీదారుగా నిలిచేవారు. భారత్‌పై ఆకాశాన్ని అంటే సుంకాలు విధించి రష్యా చమురు కొనుగోలుపై మరిన్ని ప్రతీకార పన్నులు విధిస్తామని బెదిరించిన ట్రంప్ అదే రష్యా నుంచి డీజిల్‌ను దిగుమతి చేసుకునేందుకు పుతిన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇదే ట్రంప్ రష్యాకు నిధులు తగ్గించి రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించి తనకు శాంతి బహుమతి రావాలని కోరుకున్నారు. ఈ వైరుధ్యం ట్రంప్ ద్వంద్వ ప్రమాణాలను స్పష్టంగా బయటపెడుతున్నది.
రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్న సమయం అత్యంత ఆశ్చర్యకరంగా ఉంది. రష్యా నుంచి చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేసే భారత్, చైనా వంటి దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారాన్ని ట్రంప్‌కు కల్పించే లిండ్సే గ్రాహం రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల చట్టం ఆయన సంతకం చేసిన కొన్ని వారాలకే ఈ పరిణామం చోటుచేసుకోవడం విచిత్రం. ఇది సంబంధాలను దెబ్బతీయడమే కాకుండా అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందంపై కూడా ప్రభావం చూపింది.
ఇప్పుడు కీలకమైన మధ్యంతర ఎన్నికలకు ముందు ఇంధన ధరలను తగ్గించే లక్ష్యంతో అమెరికా స్వయంగా రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తింది. ట్రంప్ రష్యాపై ఆంక్షలు విధిస్తారా? ఒకవేళ విధించకపోతే ఆయనకు ఎల్లప్పుడూ మరో ప్రత్యామ్నాయం ఉంది. అదే ట్రంప్ ఎప్పుడూ వెనుకడుగు వేస్తారు. అని అమెరికాకు చెందిన పరిశోధనా సంస్థ కాటో ఇన్స్టిట్యూట్ ఉపాధ్యక్షుడు స్కా లిన్సికోమ్ చమత్కరించారు.
మధ్యంతర ఎన్నికలే లక్ష్యంగా&
నవంబర్‌లో జరగనున్న మధ్యంతర ఎన్నికలకు ముందు ప్రజాగ్రహాన్ని చల్లార్చడానికి ట్రంప్ చేస్తున్న చివరి ప్రయత్నంగా భావిస్తున్నారు. అమెరికా-ఇరాన్ వార్ తో డీజిల్ ధరలు 70 శాతం మేర పెరిగాయి. అమెరికా రైతులకు ఇది భారీ భారం. అందుకే ఉపశమనం కలిగించేందుకు ట్రంప్ రష్యా అధ్యక్షుడికి ఫోన్ చేయవలసి వచ్చింది. రష్యా తక్షణమే 3 లక్షల టన్నుల డీజిల్ అమెరికా, ప్రపంచ మార్కెట్లకు విడుదల చేస్తుందని ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ప్రకటించారు. దీని తర్వాత నవంబర్‌లో మరో 5 లక్షల టన్నులు, ఆ తదుపరి మరో 10 లక్షల టన్నుల డీజిల్ రష్యా నుంచి విడుదల కానున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

