హెచ్‌యూఎల్ షాక్.. డిటర్జెంట్ ఉత్పత్తుల ధరలను పెంచిన సంస్థ
దేశంలో అతిపెద్ద ఎఫ్ఎంసీజీ సంస్థ హిందుస్థాన్ యునిలీవర్(హెచ్‌యూఎల్) కొనుగోలుదారులకు షాకిచ్చింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 10: అన్ని రకాల డిటర్జెంట్ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్టు తాజాగా ప్రకటించింది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో సర్ఫెక్సల్, రిన్, వీల్ వంటి ఉత్పత్తుల ధరలను రెండంకెల వరకు సవరించింది. ఇప్పటి వరకు నాలుగుసార్లు ధరలు పెంచిన సంస్థ..తాజాగా ఉత్పత్తి వ్యయం అధికం కావడంతోపాటు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పామాయిల్, ప్యాకేజింగ్ ఖర్చులు అధికమవడం వల్లనే ఈ ఉత్పత్తుల ధరలను సవరించాల్సి వచ్చిందని పేర్కొన్నది. ఈ ఏడాది ఇప్పటి వరకు వీల్ పౌండర్ ధరను రెండు సార్లు సవరించిన సంస్థ..సర్ఫ్క్సెల్ ధరను నాలుగు సార్లు పెంచింది.
ధరల పెంపు వివరాలు
- కిలో సర్ఫెక్సల్ ప్యాక్ ధర రూ.167 నుంచి రూ.172కి సవరించింది. 500 గ్రాముల ప్యాక్ ధర రూ.85 నుంచి రూ.87కి సవరించింది.
- సర్ఫెక్సల్ డిటర్జెంట్ బార్స్ 250 గ్రాముల ధరను 7.11 శాతం సవరించింది. దీంతో ఈ డిటర్జెంట్ రూ.42 నుంచి రూ.45కి చేరుకున్నది.
- అలాగే సర్పెక్సల్ క్విక్ వాష్‌ని రూ.235 నుంచి రూ.245కి పెంచింది. 500 గ్రాముల ప్యాక్ ధరను రూ.118 నుంచి రూ.123కి సవరించింది.
- రిన్ డిటర్జెంట్ అలా 500 ఎంఎల్ ధరను రూ.95కి సవరించింది. అంతకుముందు ఇది రూ.90గా ఉన్నది.
- కిలో రిన్ పౌడర్‌ను రూ.120 నుంచి రూ.123కి, 500 గ్రాముల ప్యాకెట్‌ను రూ.61 నుంచి రూ.63కి పెంచింది.
- కిలో వీల్ పౌండర్ ప్యాక్‌ను రూ.93కి సవరించింది. 500 గ్రాముల ప్యాక్ విలువను రూ.47కి పెంచింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

