అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ కిక్కు
అమెజాన్ ఇండియా ప్రకటించిన గ్రేట్ ఇండియా ఫెస్టివల్ 2026కి కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది.
బెంగళూరు, అక్టోబర్ 10: ఈసారి ఉత్పత్తుల ఆర్డర్ బుకింగ్ రెండింతలు పెరిగాయని, అలాగే 44 కోట్ల మంది సందర్శించారని పేర్కొన్నది. ఈసారి షాపింగ్‌లో కొత్త ఒరవడి సృష్టించిందని, 72 శాతానికి పైగా కస్టమర్లు చిన్నస్థాయి నగరాల నుంచి రావడం విశేషమని, అలాగే తొలిసారి షాపింగ్ చేసేవారి సంఖ్య దాదాపు 100 శాతం పెరిగారని కంపెనీ వెల్లడించింది.
ప్రధానంగా స్మార్ట్ఫోన్లు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ, గృహోపకరణాలు, రోజువారి ఉపయోగించే వస్తువులకు ఎనలేని గిరాకీ నెలకొన్నదని పేర్కొన్నది. ఈ పండుగ సీజన్లో డిస్కౌంట్లు, పలు బ్యాంకులు ఆఫర్లు అందిస్తుండటంతోపాటు ఎక్సేంజ్, ఇన్స్టాల్మెంట్ ఫైనాన్సింగ్ ఆకట్టుకోవడానికి దోహదపడిందని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ శ్రీవాత్సవ తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

