బస్సు కిందపడి నవ వధువు మృతి
వాహనం అదుపుతప్పి.. బస్సు కిందపడి నవవధువు మృతిచెందిన ఘటన చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీనగర్కు చెందిన లావణ్య(25)కు శ్రీకాంత్‌తో ఆగస్టు 30న వివాహమైంది. శనివారం మధ్యాహ్నం దంపతులిద్దరూ కలిసి ద్విచక్రవాహనంపై చాదర్‌ఘాట్ వైపు బయలుదేరారు. మార్గమధ్యలో అక్బర్‌బాగ్ డిమార్ట్ వద్ద వారు వెళ్తున్న వాహనం స్కిడ్ అయింది. ఈ క్రమంలో ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు.
- చాదర్‌ఘాట్ పీఎస్ పరిధిలో ఘటన
మలక్‌పేట, అక్టోబర్ 10: వాహనం అదుపుతప్పి.. బస్సు కిందపడి నవవధువు మృతిచెందిన ఘటన చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీనగర్కు చెందిన లావణ్య(25)కు శ్రీకాంత్‌తో ఆగస్టు 30న వివాహమైంది. శనివారం మధ్యాహ్నం దంపతులిద్దరూ కలిసి ద్విచక్రవాహనంపై చాదర్‌ఘాట్ వైపు బయలుదేరారు. మార్గమధ్యలో అక్బర్‌బాగ్ డిమార్ట్ వద్ద వారు వెళ్తున్న వాహనం స్కిడ్ అయింది. ఈ క్రమంలో ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు.
అంతలో అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సు వెనుక చక్రం కింద లావణ్య పడిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందింది. కండ్లేదుటే భార్య చనిపోవడంతో భర్త శ్రీకాంత్ గుండెలవిసేలా రోదించాడు. చాదర్‌ఘాట్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా దవాఖాన మార్చూరీకి తరలించారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ కాసాని బ్రహ్మమురారీ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

