Bitcoin | వాషింగ్టన్, జనవరి 20: బిట్‌కాయిన్ విలువ ఆల్‌టైమ్ హైని తాకింది. మునుపెన్నడూ లేనివిధంగా 1,09,241 డాలర్లు పలికింది. సోమవారం ఒక్కరోజే 5.5 శాతం పుంజుకున్నది. అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకార ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఈ క్రిప్టోకరెన్సీకి మార్కెట్లో డిమాండ్ తారాస్థాయికి చేరింది. ట్రంప్.. క్రిప్టో మార్కెట్‌కు మద్దతునిస్తున్న విషయం తెలిసిందే. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత క్రిప్టో ఇండస్ట్రీ అనుకూల విధానాలు, నిర్ణయాలుంటాయని గతంలోనే చెప్పారు.