Poland : పోలాండ్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ఒక రైల్వే క్రాసింగ్ వద్ద పట్టాలపై ట్రక్కు నిలిచిపోయింది. ఆ వెంటనే క్షణాల్లోనే ట్రక్కును వేగంగా వచ్చిన రైలు ఢీకొంది. దీనికి సంబంధించిన దృశ్యం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ప్రస్తుతం ఈ షాకింగ్ వీడియో స్థానికంగా వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలివి. పోలాండ్లోని గినియా-జీలోనా గోరా మార్గంలో పీకేపీ ఇంటర్సిటీ రైలు ప్రయాణిస్తుంటుంది.
తాజాగా ఈ రైలు వెళ్లే మార్గంలో ఒక రైల్వే క్రాసింగ్ వద్ద భారీ ట్రక్కు ఒకటి పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది. ట్రక్కు పట్టాలపైకి వెళ్లేటప్పుడు రైల్వే క్రాసింగ్ బ్యారియర్స్ ఓపెన్ అయి ఉన్నాయి. దీంతో ఆ ట్రక్కు పట్టాలపైకి చేరింది. మరికొన్ని క్షణాల్లోనే పట్టాలు దాటి ఇంకోవైపు వెళ్లాల్సింది. అయితే, ట్రక్కు పట్టాలపైకి చేరుకోగానే.. బ్యారియర్స్ క్లోజ్ అయ్యాయి. దీంతో ట్రక్కు పట్టాలపైనే నిలిచిపోయింది. ఆ ట్రక్కు ముందుకు, వెనక్కు కదలడానికి అవకాశం లేకుండా బ్యారియర్స్ అడ్డుగా నిలిచాయి. అయినప్పటికీ ట్రక్కు డ్రైవర్ ఆ వాహనాన్ని ఎటో ఒకవైపు కదల్చడానికి ప్రయత్నించాడు.
🚨 Ciężarówka na przejeździe, opuszczające się rogatki. Chwilę później – zderzenie z pociągiem.
To nagranie z monitoringu pokazuje moment, który mógł zakończyć się tragicznie.
Samochód ciężarowy prowadzony przez zawodowego kierowcę wjechał na przejazd, chwilę później w naczepę… pic.twitter.com/s5B6TAfOVJ
— PLK SA (@PKP_PLK_SA) September 3, 2026
కానీ, సాధ్యం కాలేదు. కానీ, డ్రైవర్ ఉన్న ఇంజిన్ భాగం పట్టాలు దాటికి ముందుకు ఉంది. ఈ సమయంలో ఇంటర్సిటీ ప్యాసింజర్ ట్రైన్ పట్టాలపైకి వేగంగా దూసుకొచ్చింది. ట్రక్కు డ్రైవర్ బ్యారియర్స్‌ను ఢీకొట్టి మరీ బయటకు వెళ్లేందుకు ప్రయత్నించేలోపే.. రైలు ఢీకొంది. ఈ ఘటనలో ట్రక్కు నుజ్జునుజ్జయింది. ఆ ట్రక్కు భాగాలు ఎగిరిపడ్డాయి. అయితే, ఈ ఘటనలో ట్రక్కు డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. వాహనం పాడైనా డ్రైవర్ మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. అయితే, లోకో పైలట్ (ట్రైన్ డ్రైవర్)కు మాత్రం గాయాలయ్యాయి.
రైలు ముందుభాగం తీవ్రంగా దెబ్బతింది. ట్రక్కును ఢీకొన్న అనంతరం కొంతదూరం వెళ్లి నిలిచిపోయింది. ఈ ఘటనలో ప్రయాణికులకు కూడా ఎలాంటి గాయాలు కాలేదు. లోకో పైలట్‌ను వెంటనే అధికారులు స్థానిక ఆస్పత్రికి చేర్చి, చికిత్స అందిస్తున్నారు. రైలు వచ్చే సమయంలో ట్రక్కులాంటివి అడ్డంగా పట్టాలపై, బ్యారియర్స్ వల్ల నిలిచిపోతే.. వాటిని ఢీకొట్టి అయినా సరే ట్రక్కుతో వెళ్లిపోవడమే మంచిదని కొందరు నిపుణులు చెబుతున్నారు.