Swatantra Bharadwaj: సీజేపీ మద్దతుదారుడిపై అటాక్ చేసిన భరద్వాజ్ అరెస్టు
Swatantra Bharadwaj: సీజేపీ మద్దతుదారుడిపై అటాక్ చేసిన భరద్వాజ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిషూ ఆజాద్ అనే విద్యార్థి తండ్రిని భరద్వాజ్ కొట్టాడు. ఈ నేపథ్యంలో అతనిపై ఫిర్యాదు నమోదు చేశారు. సీజేపీకి హామీ ఇచ్చినట్లే భరద్వాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన సమయంలో.. నిషూ ఆజాద్ అనే కార్యకర్త తండ్రిని స్వతంత్ర భరద్వాజ్( Swatantra Bharadwaj) చితకబాదాడు. అయితే ఆ కేసులో ఇవాళ నిందితుడు స్వతంత్ర భరద్వాజ్‌ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 72 గంటల్లోగా భరద్వాజ్‌ను అరెస్టు చేస్తామని సీజేపీకి ఢిల్లీ పోలీసులు హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ అరెస్టు చోటుచేసుకున్నది. బులంద్షెమర్లో పోలీసులు బృందాలు అతన్ని పట్టుకున్నాయి. గతంలోనూ అతను పోలీసులు నుంచి తప్పించుకున్నాడు. నిరసన సమయంలో సంజయ్ కుమార్ తలను పగలగొట్టినట్లు భరద్వాజ్ మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నిందితుడు భరద్వాజ్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అతన్ని అరెస్టు చేయాలని సీజేపీ డిమాండ్ చేసింది. పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్లో కూడా ఆ పార్టీ ఫిర్యాదు చేసింది.
#WATCH | Bulandshahr, Uttar Pradesh | On his claim made on a podcast of attacking CJP activist Nishu Azad’s father during CJP protest at Jantar Mantar, Swatantra Bharadwaj says, “What people are calling an attack was an act of self-defence. If I had not acted in self-defence, I… pic.twitter.com/iU9fpeNxVC
— ANI (@ANI) September 4, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

