హుజురాబాద్ :ఉద్యమ నాయకుడు, హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు పట్టం కట్టాలని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా.దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నారు. శనివారం ఆయన హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట మండలంలోని రాచపల్లి, శీతంపేట గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలరాజు యాదవ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించి, రాష్ట్రం ఏర్పాటు కోసం కేసీఆర్ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడ్డ ఏడేండ్లలోనే అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ సీనియర్ నాయకులు అన్నం ప్రవీణ్, సాయి ప్రసాద్, పోతరాజు రాజు, శ్రీధర్, శ్రీనివాస్, మధు, నరేష్, అనిల్, సంతోష్, విక్రమ్, రాజు, శ్రీకాంత్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.