బొడిగె శోభ ఓ చెల్లని నాణెం : వీర్ల వెంకటేశ్వర్ రావు
బొడిగె శోభ | చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభపై రామడుగు సింగిల్ విండో చైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నేత వీర్ల వెంకటేశ్వర్ రావు నిప్పులు చెరిగారు.

కరీంనగర్ : చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభపై రామడుగు సింగిల్ విండో చైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నేత వీర్ల వెంకటేశ్వర్ రావు నిప్పులు చెరిగారు. చొప్పదండి నియోజకవర్గంలో బొడిగె శోభ ఓ చెల్లని నాణెం అని విమర్శించారు. రాజకీయ భవిష్యత్ కోసం సీఎం కేసీఆర్ కుటుంబంపై బొడిగె శోభ దూషణలకు పాల్పడటం శోచనీయం అని అన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన సీఎం కేసీఆర్పై అవాస్తవాలు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. చొప్పదండిలో శోభకు తొలిసారి టికెట్ ఇచ్చినప్పుడు కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ అందరికీ నచ్చజెప్పి.. శోభను కేసీఆర్ ఎమ్మెల్యేను చేశారు. అన్ని రకాలుగా ఆదరించిన మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్కుమార్పై అసత్యాలు మాట్లాడిన శోభ విజ్ఞత ఏ పాటిదో తెలుస్తోందని వీర్ల వెంకటేశ్వర్ రావు అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

