హుజూరాబాద్ : టీఆర్ఎస్ వీరాభిమాని వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్నాడు. హుజూరాబాద్ పట్టణంలోని 5వ వార్డులోని చాకలివాడకు చెందిన పైడాకుల రాజశేఖర్ టీఆర్ఎస్ కు పెద్ద ఫ్యాన్. అయితే తన అభిమానాన్ని చాటుకునేందుకు వినూత్నంగా తలపై టీఆర్ఎస్ ఆకృతిలో కటింగ్ చేయించుకున్నాడు. చికెన్ సెంటర్ నడుపుకునే రాజశేఖర్ ఉద్యమనేత సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని ఎంతగానో అభిమానిస్తుంటాడు. అయితే పార్టీ నెలకొల్పి విజయవంతంగా 20ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు.