ప్రసిద్ధ డిజైనర్ ప్రియాంక మోదీ ప్రపంచమంతా తిరిగింది. దేశదేశాల ఆభరణాలను అధ్యయనం చేసింది. సొంతంగా అనేక డిజైన్లకు ప్రాణం పోసింది. కానీ, గిరిజనుల అలంకరణల ముందు అవన్నీ దిగదుడుపే అనిపించింది.
ఆ డిజైన్‌లోని సరళత ఆమెను అబ్బురపరిచింది. వాటికి ఆధునికతను జోడించి సరికొత్త శ్రేణి నగలను రూపొందించింది. ఫొటోలో కనిపిస్తున్నది వాటిలో ఒకటి.