తాండూర్ : ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) ఆధ్వర్యంలో ఈ నెల 9న నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసి దినోత్సవ సభను (Tribal Day) విజయవంతం చేయాలని తుడుందెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ముండిగ రవీందర్( Ravinder) , మండల అధ్యక్షుడు కుర్సింగ బాబురావు, ప్రధాన కార్యదర్శి యాపల సమ్మయ్య పిలుపునిచ్చారు. బుధవారం తాండూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సభ కరపత్రాలను ఆవిష్కరించారు.
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం కిష్టంపేట బస్టాండ్ సమీపంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ప్రక్కన సభ జరుగుతుందని వివరించారు. ప్రభుత్వాలు మారుతున్నా ఆదివాసీలు అభివృద్ధికి అమడదూరంలోనే ఉన్నారన్నారు. మండల కేంద్రంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి గిరిజన ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గడ్డం మణికుమార్, శంకర్, పోషన్న, బాపు, మల్లేష్, మహేష్, తిరుపతి, పరపతి రావు, మాణిక్ రావు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.