కొత్తగా.. కాయిన్ చేశారు!
కొత్త అంటే ఆకాశంలోంచి ఊడిపడదు. కొన్నిసార్లు పాతలోంచి కూడా పుట్టుకురావచ్చు. గమ్మత్తుగా కనిపిస్తూ అందరినీ అలరించవచ్చు. నయా ట్రెండ్‌గా మారిన ‘కాయిన్ జువెలరీ’ కూడా అంతే. మన చేతుల్లో ఆడిన నాణేలు, విదేశాల్లో కనిపించే రూపాయలు, బొమ్మలు చిత్రించిన బిళ్లలనే తన కలెక్షన్లో పొదువుకుంది.
బంగారు కాసులంటే ఆడవాళ్లకు తగని మోజు. మనసుంటే ఆ సంప్రదాయ అలంకరణను స్టయిల్ స్టేట్మెంట్గా మార్చేసి ఫ్యాషన్ వీధిలో ప్రవేశపెట్టవచ్చు. పసిడి పతకాల్లోనే కాదు, రజత పతకాల్లోనూ మెరిపించవచ్చు. అదెలా అంటారా? ఇదిగో ఇలా.. కస్తూరి సొమ్ముల్లో కలిసిపోయిన ‘కాయిన్ నగల’ను చూస్తే మీకే తెలుస్తుంది మరి!

కొత్త అంటే ఆకాశంలోంచి ఊడిపడదు. కొన్నిసార్లు పాతలోంచి కూడా పుట్టుకురావచ్చు. గమ్మత్తుగా కనిపిస్తూ అందరినీ అలరించవచ్చు. నయా ట్రెండ్‌గా మారిన ‘కాయిన్ జువెలరీ’ కూడా అంతే. మన చేతుల్లో ఆడిన నాణేలు, విదేశాల్లో కనిపించే రూపాయలు, బొమ్మలు చిత్రించిన బిళ్లలనే తన కలెక్షన్లో పొదువుకుంది. వాటికే ఆభరణాల హంగులన్నీ అద్ది ఆకట్టుకునేలా చూపిస్తున్నది. అంతేకాదు, మది దోచే ముస్తాబు విషయంలో పాత నుంచి కొత్తలోకి పరకాయ ప్రవేశం చేసింది. ఇన్ని మార్పులు చేశాక, ఆ బిళ్లల నగలు ఆడపిల్లలను అబ్బో అనిపించకుండా ఎందుకుంటాయి? ఆ తర్వాత అవి మరిన్ని హంగులద్దుకోకుండా ఎందుకు ఊరుకుంటాయి? అందుకే నెక్లెసులు, దుద్దులు, జుంకాలు, ఉంగరాలు, తాళం గుత్తులు… ఇలా సొమ్ములన్నిటిలోనూ కాయిన్ నగలు సొగసులీనుతున్నాయి.

ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూపాయి నుంచి పాతకాలం నాటి పదిపైసలు, ఐదుపైసల బిళ్లల దాకా రకరకాల కాయిన్లు వీటిలో ఉంటున్నాయి. అంతేకాదు రాణుల బొమ్మలు, పేర్లు చెక్కిన నాణేలు, మనసైన వాళ్లకు శుభాకాంక్షలు కూడా వీటికి జోడవుతున్నాయి. అమ్మవారు, రాధాకృష్ణుల ప్రతిరూపాలతో తీర్చిదిద్దిన కాయిన్లూ ఇందులో వస్తున్నాయి. మొత్తానికి నగల్లో నాణేలు ఇలా నాణ్యంగా ఒదిగిపోయాయన్నమాట!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

