వేములవాడ : వేములవాడ పట్టణ సీఐ కరుణాకర్(CI Karunakar) పై బదిలీ వేటు పడింది. అవినీతి ఆరోపణ నేపథ్యంలో ఆయనను ఐజీ కార్యాలయానికి బదిలీ(Tranfer) చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈనెల 22వ తేదీన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఐదుగురు పోలీసులు, హోంగార్డులుతో కలిపి మొత్తం పది మందిని హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఎస్పీ అఖిల్ మహజాన్(Akhil Mahajan) ఆదేశాలు జారీ చేయడం జిల్లాలో చర్చాంశనీయంగా మారింది. ఒకేసారి పది మందిని హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేయడం ఇదే ప్రథమమని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.