ఎల్లారెడ్డి, మార్చి 4 : కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించేందుకు లంచం తీసుకొం టూ ఎల్లారెడ్డి ట్రాన్స్‌కో డీఈఈ భద్రయ్య శుక్రవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ కథనం ప్రకారం.. కామారెడ్డికి చెందిన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ సాయి ప్రకాశ్‌కు రూ.3 లక్షల బిల్లు మంజూరైంది. ఈ చెక్కులు అందజేసేందుకు భద్రయ్య కాంట్రాక్టర్‌ను రూ.20 వేలు లంచంగా అడిగాడు. చివరకు రూ.18 వేలకు అంగీకరించాడు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో డీఈఈ భద్రయ్య తన నివాసంలో కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకొన్నారు.