నేటి నుంచి జిల్లాలో సివిల్ సర్వీసెస్ అధికారులకు శిక్షణ
- ఐదు మండలాల్లోఐదు బృందాల పర్యటన
- నోడల్ అధికారులుగా నగరపాలక కమిషనర్ ఆదర్శ్ సురభి,జడ్పీ సీఈవో అప్పారావు నియామకం
మామిళ్లగూడెం, మార్చి 6: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై శిక్షణ పొందేందుకు 23 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్తో పాటు ఇతర సివిల్ సర్వీసులకు ఎంపికైన శిక్షణ అధికారులు సోమవారం నుంచి ఈ నెల 12 వరకు జిల్లాలో పర్యటించనున్నారు. ఇప్పటికే వివిధ కేటగిరీల్లో ఢిల్లీలో శిక్షణ పొందిన వీరు జనవరి 19 నుంచి హైదరాబాద్లోని ఎంహెచ్ఆర్డీలో పలు విభాగాల్లో శిక్షణ పొందుతున్నారు. వీరు గ్రామీణ ప్రాంతాల్లో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, ప్రజల జీవన విధానాలను అవగాహన చేసేందుకు జిల్లాలో పర్యటించనున్నారు. వీరికి క్షేత్ర స్థాయిలో ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, జడ్పీ సీఈవో వీవీ అప్పారావు నియమితులయ్యారు. మండల, గ్రామస్థాయిలో ఎంపీడీవోలు, ఎంపీవోలను కేటాయిస్తూ కలెక్టర్ వీపీ గౌతమ్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాకు చేరుకున్న సివిల్ సర్వీసెస్ అధికారులు ముందుగా కలెక్టర్ వీపీ గౌతమ్ను ముందుగా మర్యాదపూర్వకంగా కలుస్తారు. అనంతరం ఐదు బృందాలుగా గ్రామాల్లోకి వెళ్లి పరిస్థితులను అధ్యయనం చేస్తారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

