అమరావతి : కడప (Kadapa) జిల్లాలో ఘోరం జరిగింది. ఆడుతూ పాడుతూ స్కూల్‌కు వెళ్తున్న ఇద్దరు విద్యార్థులకు(Students) విద్యుత్ తీగలు తగిలి ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. కడప పట్టణంలోని అగాడివీధిలో ఈ ఘోరం జరిగింది.
విద్యార్థి తన్వీర్(11)తో పాటు అతడి స్నేహితుడు ఆదాం(10) ఇద్దరు కలిసి సైకిల్‌పై స్కూల్‌కు బయలు దేరారు. స్కూల్ సమీపంలో తెగిఉన్న విద్యుత్ తీగలు(Electric wires) తగిలి తన్వీర్ మృతిచెందాడు. గాయపడిన విద్యార్థిని పాఠశాల యాజమాన్యం వెంటనే ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.