నిడమనూరు, సెప్టెంబర్ 26 : నిడమనూరు మండలంలోని వేంపాడు – గగ్గెనపల్లివారిగూడెం గ్రామాల నడుమ రాకపోకలు నిలిచి పోయాయి. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా వేంపాడు శివారులోని ప్రధాన రహదారిపై నుంచి వరద నీరు పోటెత్తుతోంది. ఈ కారణంగా గగ్గెనపల్లివారిగూడెం, కుమ్మరిగూడెం గ్రామాల ప్రజలు అన్నారం, దుగ్గెపల్లి గ్రామాల మీదుగా ప్రయాణం సాగిస్తున్నారు.