న్యూఢిల్లీ, జూలై 19: వియత్నాంలో శనివారం హఠాత్తుగా కురిసిన కుంభ వృష్టికి సముద్రంలో పర్యాటకుల పడవ మునిగిపోయి 34 మంది మరణించగా మరో 8 మంది గల్లంతయ్యారని వియత్నాం మీడియా తెలిపింది. సందర్శకులు అమితంగా ఇష్టపడే హా లాంగ్ బే టూర్కు వెళుతున్న వండర్ సీ బోట్ భారీ వర్షం కారణంగా మునిగిపోయింది. ఆ సమయంలో పడవలో 48 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు.
వీరంతా వియత్నామీ పౌరులేనని మీడియా కథనాలు పేర్కొన్నాయి. నీట మునిగిన 11 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. పడవ మునిగిపోయిన ప్రదేశం సమీపంలోనే మృతదేహాలు లభించాయని వీఎన్ ఎక్స్ప్రెస్ వార్తాపత్రిక తెలిపింది.