సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : నువ్వే కొడతావా సెంచరీ.. నేనూ కొడతాను అంటూ.. పెట్రోల్‌కు సవాల్ విసురుతున్నది టమాట. కూరగాయల్లో మేటి నేనేనంటూ ధరల్లో దరహాసాన్ని ప్రదర్శిస్తున్నది. ఇంధన ధరలతో పోటీ పడుతూ ముందుకు సాగుతున్నది. దీంతో సామాన్యులు కొనలేని విధంగా టమాట ధర కొండెక్కింది. కిలోకు రూ.100 పలుకుతూ వారం రోజులుగా వంటింటికే కరువైంది. దీంతో సామాజిక మాధ్యమాల్లో పలువురు చలోక్తులు విసురుతున్నారు. నెటిజన్లు పోస్టు చేస్తున్న మీమ్స్ అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నాయి.
అతిగా వానలే కారణం
గతంలో ఎన్నడూ లేనివిధంగా అతిగా వానలు పడటంతోనే కూరగాయల దిగుమతి తగ్గిందంటున్నారు రైతులు. ఈ మధ్య కురిసిన తుఫాన్ వల్ల అనేక కూరగాయల పంటలు దెబ్బతిన్నాయని చెబుతున్నారు. మార్కెట్‌కు సరుకు తక్కువగా రావడంతో రూ.2వేలకు ఒక బాక్సు చొప్పున టమాటను తీసుకువస్తున్నామని వ్యాపారుల పేర్కొంటున్నారు. ధరలు ఎక్కువైనందు వల్ల ఎవరూ కొనరనే ఉద్దేశంతో వారం రోజుల నుంచి అసలు టమాట తీసుకురావడమే బంద్ చేశామని అల్వాల్ రైతు బజార్లో విక్రయించే ఓ మహిళా వ్యాపారి పేర్కొన్నది.
టమాటర్పై మీమ్స్..