Mahesh babu on OTT | కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీ చాలా నష్టపోయింది అంటారు కానీ.. నిజానికి ఇది వచ్చిన తర్వాత చాలా మారిపోయింది. ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. కనీసం కలలో కూడా ఊహించని విధంగా ఇండస్ట్రీ కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంది. అటువైపు అడుగులు వేసింది. కొత్త సినిమా అంటే థియేటర్స్ అని మాత్రమే అనుకున్న ప్రేక్షకులకు.. ఓటీటీని మరింత దగ్గర చేసింది. రిలీజ్ సినిమా ఇంట్లో కూర్చొని మొదటి రోజు టీవీలో చూస్తామని ఎవరూ అనుకోలేదు. కానీ కరోనా వైరస్ వల్ల అది సాధ్యమైంది. ఇక సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లకు కూడా ఇప్పుడు డిమాండ్ పెరిగిపోయింది.
అందులో స్టార్ హీరో హీరోయిన్లు నటిస్తున్నారు. తెలుగులో తమన్నా, కాజల్, నిత్యా మీనన్ లాంటి ఎంతో మంది హీరోయిన్లు ఇప్పటికే వెబ్ సిరీస్‌ల్లో నటించారు. హీరోలు కూడా అటువైపు అడుగులు వేస్తున్నారు. వెంకటేశ్, రానా దగ్గుబాటి కలిసి ఒక హాలీవుడ్ వెబ్ సిరీస్ రీమేక్‌లో నటిస్తున్నారు. బాలకృష్ణ కూడా దీని గురించి ఓపెన్ అయ్యాడు. కథ నచ్చితే ఓటీటీలో అడుగు పెట్టడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చాడు బాలయ్య. మారుతున్న కాలంతో పాటు తాము కూడా మారాలి కదా అంటూ సమాధానమిచ్చాడు. ఆహా కోసం చిరంజీవి కూడా ఒక వెబ్ సిరీస్ చేస్తాడనే ప్రచారం చాలా రోజుల నుంచి జరుగుతుంది.
ఇక ఇప్పుడు మహేశ్ బాబు కూడా దీని గురించి ఓపెన్ అయ్యాడు. ఈ మధ్య ఒక ప్రెస్ మీట్‌కు వచ్చిన మహేశ్ బాబు చాలా విషయాల గురించి చెప్పాడు. సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్‌లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నాడు సూపర్ స్టార్. అలాంటి మహేశ్ బాబు ఓటీటీ గురించి తన అభిప్రాయం ఓపెన్‌గానే చెప్పాడు. మిమ్మల్ని వెబ్ సిరీస్‌లో చూడొచ్చా.. ఓటీటీపై మీ అభిప్రాయం ఏమిటి అంటూ మహేశ్‌ను అడిగితే.. ఆయన కూడా చాలా ఓపెన్ గా సమాధానం చెప్పాడు. ప్రస్తుతానికి సినిమాలపైనే దృష్టి పెట్టాను.. ఏమో భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేము కదా.. మంచి కథ వచ్చినప్పుడు వెబ్ సిరీస్ కూడా చేస్తానేమో అంటూ హింట్ ఇచ్చాడు. ఓటీటీకి తాను వ్యతిరేకం కాదని.. భవిష్యత్తులో తాను కూడా అక్కడ ఎంట్రీ ఇవ్వడాన్నీ తోసిపుచ్చలేం అంటున్నాడు సూపర్ స్టార్. ప్రస్తుతం ఈయన పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. 2022 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Pawan Kalyan | పవన్ కల్యాణ్ ప్రసంగంతో చిరంజీవి అప్ సెట్ అయ్యాడా..?
Mohanbabu | నువ్వడిగిన ప్రతీ మాటకు సమాధానమిస్తా: పవన్ స్పీచ్ పై మోహన్ బాబు
పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇండస్ట్రీకి లాభమా.. నష్టమా..?
పవన్ కళ్యాణ్ స్పీచ్ | ఇండస్ట్రీలో వేడి రాజుకుంది.. నాని ముందుకొచ్చాడు..
Nagarjuna: హౌస్‌లో ఉండేందుకు అర్హత లేనివాళ్లు ఎవరో చెప్పాలంటూ హౌజ్‌మేట్స్‌కి నాగ్ ప్రశ్న