Anurag Kulakarni | టాలీవుడ్ స్టార్ సింగర్స్ అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరాలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. శుక్రవారం సీక్రెట్‌గా పెళ్లి చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సింగర్ అనురాగ్ కులకర్ణి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సూపర్ సింగర్ సీజన్ 8 విన్నర్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత సినిమాల్లో పాటలు పాడుతూ స్టార్ సింగర్ తెచ్చుకున్నాడు. ఇక అనురాగ్ పాడిన వాటిలో ఆర్ఎక్స్ 100 సినిమాలోని పిల్లారా సాంగ్‌తో పాటు కేరాఫ్ కంచరపాలెం సినిమాలో ఆశ పాశం, శతమానం భవతిలోని మెల్లగా తెల్లారిందోయ్ అలా, శ్యామ్ సింగరాయ్‌లో ప్రణవాలయ తదితర పాటలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.
సూపర్ సింగర్ 4లో ఎంట్రీ ఇచ్చింది రమ్య బెహరా. ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి రమ్యను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. రమ్య పాడిన పాటలలో ప్రేమకథా చిత్రంలోని కొత్తగున్న హాయి నువ్వా, లౌక్యంలోని సూడు సూడు, బాహుబలిలోని దీవరా, శతమానం భవతిలోని మెల్లగా తెల్లారిందోయ్ అలా, ఇంకా ఇవే కాకుండా టెంపర్, ఒక లైలా కోసం, చిన్నదాన నీకోసం, కొత్తజంట, ఇస్మార్ట్ శంకర్, దిక్కులు చూడకు రామయ్య, రంగ్ దే తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Singers #Anuragkulkarni & #Ramyabehara tied knot.
Congratulations to the couple ❤️ pic.twitter.com/dXCe52rlNo
— Suresh PRO (@SureshPRO_) November 16, 2024