2021 మొదలై అప్పుడే మూడు నెలలు అయిపోయింది. 90 రోజులు కేలండర్ ఇయర్ లో గడిచిపోయాయి. కరోనా తర్వాత ఇండస్ట్రీలో కూడా సినిమాలు చాలానే విడుదలయ్యాయి. తొలి మూడు నెలల్లో దాదాపు 50 సినిమాల వరకు విడుదలయ్యాయి. అందులో 8 సినిమాలు అంచనాలు అందుకున్నాయి. కరోనాతో పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయిన టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈ సినిమాలు ఊపిరి పోసాయి. రవితేజ క్రాక్ సంక్రాంతికి బోణి కొడితే.. మొన్నటి జాతి రత్నాలు.. మధ్యలో ఉప్పెన వరకు చాలా సినిమాలు మంచి విజయం అందుకోవడమే కాదు.. నిర్మాతల్లో కొత్త ఉత్తేజాన్ని నింపింది.