Tollywood | టాలీవుడ్ ఆడియన్స్‌కి హిట్స్, బ్లాక్‌బస్టర్స్ అంటే అమితమైన ఆసక్తి. ప్రతి ఏడాది రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఏది హిట్, ఏది ఫ్లాప్ అన్నది టాక్ రేంజ్‌తో పాటు కలెక్షన్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. 2025లో ఇప్పటివరకు టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బ్లాక్‌బస్టర్, సూపర్‌హిట్, హిట్ సినిమాల లిస్టును ఓసారి చూద్దాం.
బ్లాక్‌బస్టర్ హిట్స్:
విక్టరీ వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబో:
సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. దిల్ రాజు నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 300 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ కావడం విశేషం. వెంకటేష్ కెరీర్లో ఇది హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.
కోర్ట్ (నాని నిర్మాణంలో):
రామ్ జగదీష్ దర్శకత్వం, హర్ష్ రోషన్ – శ్రీదేవి లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమా క్రిటికల్ అండ్ కమర్షియల్‌గా బ్లాక్‌బస్టర్. ప్రియదర్శి కీలక పాత్రలో మెప్పించాడు.
మ్యాడ్ స్క్వేర్:
మ్యాడ్ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ కొత్త కథతో నవ్వుల పంట పండించి బ్లాక్‌బస్టర్ స్టేటస్ దక్కించుకుంది.
శ్రీ విష్ణు – సింగిల్:
సరికొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ పూర్తి కుటుంబానికి వినోదాన్ని అందించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
లిటిల్ హార్ట్స్:
కేవలం ₹2.5 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా 50 కోట్ల గ్రాస్ వసూల్ చేసి “ఈ ఇయర్ బ్లాక్‌బస్టర్ కా బాప్”గా నిలిచింది.
మహావతార్ నరసింహ (డబ్బింగ్):
హోంబలే ఫిల్మ్స్ నుంచి వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీ తెలుగులోనూ ఎపిక్ బ్లాక్‌బస్టర్. ₹30 కోట్ల బడ్జెట్‌తో 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.
కొత్త లోక (మలయాళ డబ్బింగ్):
మలయాళంలో లోకగా వచ్చిన ఈ సినిమా తెలుగులో కొత్త లోకగా రిలీజై సంచలన విజయం సాధించింది.
సూపర్ హిట్ మూవీస్ చూస్తే..
నాగ చైతన్య – తండేల్:
చందూ మొండేటి దర్శకత్వంలో, సాయి పల్లవి జోడిగా నటించిన ఈ మూవీ చైతన్య కెరీర్లో 100 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయిన తొలి సినిమా.
కుబేర (ధనుష్ – శేఖర్ కమ్ముల):
ఈ సినిమాలో నాగార్జున సర్ప్రైజ్ రోల్ పోషించగా, సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సూపర్ హిట్ మూవీగా నిలిచింది.
శుభం (సమంత మేడిన్ మూవీ):
ట్రాలాలా బ్యానర్లో సమంత నిర్మించిన ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అయింది. ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్ ప్రశంసలు అందుకుంది.
హిట్ మూవీస్:
నాని – హిట్: ది థర్డ్ కేస్:
శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు మంచి టాక్, కలెక్షన్లు దక్కాయి.
మిరాయ్ & కిష్కింధపురి:
తాజాగా విడుదలైన ఈ రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతున్నాయి
ఛావా (డబ్బింగ్ – హిందీ బ్లాక్‌బస్టర్):
తెలుగులోనూ మంచి ఆదరణ పొందిన ఈ సినిమా హిట్ లిస్ట్‌లో చేరింది.
రిటర్న్ ఆఫ్ డ్రాగన్:
బిగ్ స్క్రీన్‌పై విజువల్ వండర్‌గా నిలిచిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకుని హ్యూజ్ హిట్ అందుకుంది.
రాబోతున్న భారీ అంచనాల సినిమాలు:
ఓజీ (పవన్ కళ్యాణ్)
కాంతారా ప్రీక్వెల్
అఖండ 2 (బాలకృష్ణ)
ఈ సినిమాల మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇవి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడతాయో లేదో చూడాలి. 2025లో ఇప్పటివరకు టాలీవుడ్లో చిన్న సినిమాలు పెద్ద విజయం సాధించగా, స్టార్ హీరోల సినిమాలు తమ మార్క్ చూపించాయి. ఇంకా మిగిలిన మూడు నెలల్లో ఏ సినిమాలు టాలీవుడ్‌ను ఊపేస్తాయో చూడాలి!