ఇప్పుడంతా వైర్లెస్ టెక్నాలజీనే. హెడ్‌ఫోన్స్ కూడా తరానికి తగ్గట్టు మారిపోయాయి. వాటి స్థానంలోకి ఎయిర్పోడ్లు వచ్చి చేరాయి. కానీ ఇక్కడ కనిపిస్తున్నవి మాత్రం ఆ టెక్నాలజీకి సంబంధించిన ఎయిర్పోడ్లు కాదు. ఫ్యాషన్ ప్రపంచంలో అడుగు పెట్టిన ఆ తరహా మోడల్స్ మాత్రమే.
ఎందుకంటే, వీటిలో రంగు రంగుల లిప్‌స్టిక్‌లు పొందిగ్గా అమరి ఉంటాయి. ఎంచక్కా తెరిచి పెదాలకు రంగు వేసుకోవడమే. వీటిలో కీ చెయిన్‌లా వేలాడదీసుకునేవీ వస్తున్నాయి. కాబట్టి అటు టెక్నాలజీ ఇటు ఫ్యాషన్ల కలగలుపులా లిప్‌స్టిక్‌ను ఎంచుకోవాలంటే ఈ ఎయిర్‌పోడ్స్‌ను ట్రై చేయడమే!