జగిత్యాల రూరల్ : కొవిడ్ కట్టడికి టీకాయే శ్రీరామరక్ష అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలంలోని చల్గల్ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, జడ్పీచైర్‌పర్సన్ వసంత శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా పలువురికి వ్యాక్సిన్ వేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కొవిడ్ కట్టడికి టీకాయే శ్రీరామరక్ష అని, 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎల్ల గంగనర్సు రాజన్న, పీఏసీఎస్ చైర్మన్ మహిపాల్‌రెడ్డి, ఉప సర్పంచ్ పద్మాతిరుపతి, డీఎం అండ్ హెచ్‌వో శ్రీధర్, డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో జైపాల్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, జయప్రద, స్థానిక నాయకులు పాల్గొన్నారు.