
బాలానగర్, నవంబర్ 24 : సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఉంటుందని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని పోలీస్స్టేషన్లో సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతాయని తెలిపారు. ప్రజలు సీసీ కెమెరాల ఆవశ్యకతను గుర్తించి అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో దొంగతనాలు తదితర ఘటనలు చోటుచేసుకుంటే త్వరగా నిందితులను గుర్తించవచ్చని తెలిపారు. అనంతరం మండలకేంద్రంలోని జాతీయ రహదారిపై సీసీ కెమెరాలను పరిశీలించారు. అంతకుముందు మొక్కలు నాటి నీరు పోశారు. అలాగే మండలంలోని మోతీఘనపూర్లో సీసీ కెమెరాలను ప్రారంభించారు. కార్యక్రమంలో డీఎస్పీ కిషన్, సీఐ జములప్ప, ఎస్సై వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.