నిజామాబాద్, జూలై 21 (నమస్తే తెలంగా ణ ప్రతినిధి) : ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడున్నర దశాబ్దాల తర్వాత పెద్ద పులి సంచారం సంచలనం రేకెత్తించింది. గోదావరి నదికి ఉత్తర ప్రాంతంలో నే కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్)లో ఎక్కువ గా పెద్ద పులుల అలజడి ఉండేది. గోదావరి న దికి దక్షిణాన నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల సరిహద్దులో ఏడాదిగా పులు ల సంచారం ప్రాధాన్యతను సంతరించుకున్నది. జీవనదిని దాటుకుని ఇటువైపు పులులు రావడం ఆసక్తి ని పెంచగా… వచ్చిన పు లులు ఆచూకీ లేకుండా పోవడం విషాదం నిం పుతున్నది. అటవీ శాఖ అధికారులు పులుల జాడపై ఎలాంటి ప్రకట న చేయడం లేదు. వేటగాళ్ల ఉచ్చులో పడుతున్నాయా? విషప్రయోగానికి ప్రాణాలు పోతున్నాయా ?
అంటే నోరు విప్పడం లేదు. పులుల కదలికలపై ఆధారాలున్నాయా? అంటే మౌనమే సమాధానం లభిస్తున్నది. 2025 జూలైలో కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో సంచరించిన ఐదేండ్ల వయసున్న ఎస్12 అనే మగ పులి ఆకస్మికం గా మాయమైంది. తాజాగా 2026 ఏప్రిల్‌లో భీంగల్ అడవిలో జే1 అనే మూడున్నరేండ్ల మరో మగ పులి స్థానికంగా ఓ జంతువును వే టా టడింది. తర్వాత జే1 పత్తా లేదు. నెలలు గడుస్తున్నా పులుల జాడపై అటవీ శాఖ స్పం దించకపోవడం అనుమానాలకు తావిస్తున్నది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వన్యప్రాణులకు రక్షణ కరువైందన్న వాదన బలపడుతున్నది. ఈ ఏడాది ప్రథమార్ధంలో ఉత్తర తెలంగాణను వణికించిన మూడున్నరేండ్ల పులి సంచారం లేకపోవడంతో అటవీ శాఖ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మహారాష్ట్ర నుంచి వలస వచ్చి 14 జిల్లాలు తిరిగిన ఈ మూడున్నరేండ్ల మగ పులి ఏప్రిల్ మధ్యలో నిజామాబాద్ జిల్లా భీంగల్ ఫారెస్ట్‌లో దూడను చంపింది. ఆ తర్వాత అదృశ్యమైంది. ఈ మగ పులి మైదాన ప్రాంతాల్లో తిరుగుతూ రాష్ట్రంలో సగం జిల్లాలను చుట్టేసింది. కొంత కాలంగా దీని ఉనికి ప్రశ్నార్థకం కావడంతో పులి బతికే ఉన్నదా? లేదా? అన్న ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఏప్రిల్‌లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు నమోదయ్యాయి. అంతటి మండుటెండల్లోనూ కమ్మర్పల్లి రేంజ్ పరిధిలో జే1 అనే పులి తచ్చాడింది. తీవ్రమైన ఎండల్లో 15 రోజులు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్ సరిహద్దుల్లో తిరిగి వెనక్కి వెళ్లినట్టుగా ఆధారాలు లభించలేదు. రెండు నెలలు అవుతున్నా పులి జాడ కనుక్కోలేదు.
2025 జూలైలో కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం స్కూల్ తండా సమీపంలో ఎస్ 12 అనే పులి సంచరించింది. స్థానికంగా దూడను చంపి తిన్నది. రైతులు ఆ కళేబరంపై పెస్టిసైడ్ ప్రయోగం చేయడంతో పులి కూడా మరణించి ఉండొచ్చని అనుమానాలు కలుగుతున్నాయి. అటవీ అధికారులు నలుగురిని అరెస్ట్ చేసినా పులి కళేబరం లభించలేదు. ఇంతకుముందు ఇదే ప్రాంతంలో వన్యప్రాణు లు అదృశ్యమైన ఘటనలు ఉన్నాయి. కామారెడ్డి, నిజామాబాద్ ప్రాంతాల్లో 30 ఏండ్ల త ర్వాత పులి కనిపించింది. ఇటీవల మహారా ష్ట్ర నుంచి వలస వచ్చిన పులులు సంచలనం సృ ష్టించాయి. ఎస్12 ఆచూకీ లేనప్పుడే అటవీ శాఖ హైఅలర్ట్ ప్రకటించి ఉంటే ఇప్పుడు జే1 పులి జాడ సులువుగా దొరికేదన్న వాదన వినిపిస్తున్నది. ఎస్12 మాదిరిగానే జే1 వేటగాళ్ల చేతుల్లో లేదా విష ప్రయోగానికి బలై ఉండొచ్చనే ప్రచారం జరుగుతున్నది. మూడున్నరేం డ్ల మగ పులి (జే1) వచ్చిన దారిలోనే జన్నా రం వైపు వెళ్లి ఉండొచ్చని సూత్రప్రాయంగా చెప్తున్నా ఈ ప్రకటనను స్థానికులు, వన్యప్రాణి ప్రేమికులు ఖండిస్తున్నారు.
ఏడాదిలో రెండు పులులకు సంబంధించిన ఘటనలు కలకలం రేపుతుండటంతో అటవీ శాఖ నిర్లీప్తత, నిర్లక్ష్యంపై చర్చ నడుస్తున్నది. సమర్థవంతమైన ట్రాకింగ్, మానిటరింగ్ లోపం, డ్రోన్లు, ట్రాకింగ్ కెమెరాలు తగినంతగా పని చేయకపోవడం, పశువుల నష్టానికి త్వరగా పరిహారం ఇవ్వకపోవడం, రైతుల్లో నమ్మకం కలిగించకపోవడమే ప్రధాన వైఫల్యాలుగా తెలుస్తున్నది. మహారాష్ట్ర మీదుగా పులుల వలసలు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా అటవీ శాఖ పకడ్బందీ కార్యాచరణ సిద్ధం చేయాలని ప్రజలు కోరుతున్నారు. భవిష్యత్తులో పులుల రాక పొంచి ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకోవాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు.